Supreme Judgment:ఫోర్న్ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ మరో  సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్‌లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని తాజాగా  సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ‘కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కా దు . .’ అంటూ దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది . ”. ఈ విషయంలో మద్రాస్  హైకోర్టు పెద్ద తప్పిదం చేసింది ” అని  బెంచ్ తీవ్రంగా  వ్యాఖ్యానించింది. పిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన ఈ కఠిన చట్టంపై సుప్రీంకోర్ట్ ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.

ఇదిలా ఉండగా . . తన మొబైల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసిన ఓ 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదవగా.. అతడిపై ఉన్న అభియోగాలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కూడా రద్దు చేసింది. నేటి పిల్లలు అశ్లీల వీడియోలను చూడటం అనే తీవ్రమైన సమస్యతో ఇబ్బందిపడుతున్నారని, వారిని శిక్షించే బదులు విద్యాబుద్ధులు నేర్పించేలా సమాజం పరిణతి చెందాలని మద్రాస్ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా సోమవారం (23–09-2024) తాజాగా  సుప్రీంకోర్ట్  ఈ సంచలన తీర్పు వెలువరించింది .