Heavy Rains: కుంభవృష్టి.. స్తంభించిన ముంబై

దేశ ఆర్థిక రాజధాని, మెట్రో సిటీ అయిన ముంబైలో ఎడతెరిపిలేకుండా  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలాశయాల్ని మరిపిస్తున్నాయ్ .    దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి .    ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ములుంద్, అంగేరి . , దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.అంధేరిలో ఓ మహిళ మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందింది. సెర్చ్ ఆపరేషన్‌లో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. భారీ వర్షాల ప్రభావంతో బుధవారం రాత్రి పలు విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఓ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా హైదరాబాద్‌కు మళ్లించారు. విమానయాన సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా పలు విమానాలను దారి మళ్లించినట్లు సంబంధిత సంస్థలు ప్రకటించాయి .