డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు బరితెగించింది . భారత్‌లోని ఈశాన్య రాష్ట్ర0 అరుణాచల్‌ప్రదేశ్ తమదే అంటూ తరచూ కయ్యానికి దిగే చైనా.. ఇటీవల ఏకంగా ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టినట్లుగా కూడా ఇంటిలిజెన్స్ వర్గాలు . అనుమానిస్తున్నాయి . డ్రాగన్ సైన్యం అరుణాచల్‌లోని అంజా జిల్లాలో 60 కిలోమీటర్ల మేర లోపలకు వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కపాపు ప్రాంతంలో కొద్ది రోజుల పాటు మకాం వేసినట్లుగానూ అందులో పేర్కొన్నారు. చైనా సైన్యం మంటలు వేసినట్లు, ఆహారం తిన్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత రక్షణ శాఖ ఈ కథనాలను ఖండించింది. సరిహద్దుల్లో గుర్తించని ప్రాంతాల్లో భారత్-చైనా దళాలు పహారా కాస్తాయని, రాళ్లపై చైనా దళాలు వేసినది తాత్కాలిక మార్కింగేనని, ఆక్రమణకు దిగినట్లు కాదని పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలనీ పలువురు కోరుతున్నారు .