బాలీవుడ్ హీరోయిన్, నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిపోయింది. ఈ రోజు తనకు ఒక గొప్ప రోజంటూ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎప్పటి నుంచో తనకున్న ఒక పెద్ద కల నెరవేరబోతోందని… ఇది జరిగిందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని… ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందటూ రాసుకొచ్చింది. డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. కాని కాబోయే భర్త ముఖాన్ని మాత్రం చూపించకుండా ఉంచింది. అయితే అంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏంటని అందరూ చెవులుకొరుక్కుంటున్నారు. అయితే చాలా మంది అభిమానులు, స్నేహితులు మాత్రం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోనాక్షి కొంత కాలంగా జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు ప్రచారమయ్యాయి. జహీర్ తోనే ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.