అన్ని మాధ్యమాలు కలిసి కోటి మందికి పైనే..
సోషల్ మీడియాలోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబే.. దక్షిణాదిలో అగ్రశ్రేణి హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ తో తగ్గేదేలేదు అతడి దూకుడు. అందుకే మహేశ్ దక్షిణాదిన అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా రికార్డులు బద్దలు కొట్టారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దూకుడు చూస్తే.. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది ఉన్నారు. అయితే ఏ సోషల్ మీడియా వేదిక తీసుకున్నా ‘పోకిరి’ మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం ఆశ్చర్యం. మరే సౌత్ హీరోకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరుమరి. దీంతో సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.