స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee) పూర్తి స్తాయిలో ప్రొడక్షన్స్ పనులపై ఫోకస్ పెడుతోంది. నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా క్లియర్‌గా ముందుకెళ్తోంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఈ చెన్నై సుందరి చేతిలో ఫీ మేల్ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కూడా ఉంది. అదేవిధంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ (Varun Dhawan)తో కలిసి వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఓ ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తుందట. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరితో సినిమా చేయాలనుకుంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది. హిందీలో రాబోతున్న ఈ చిత్రంలో సమంత మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ చేయబోతుందని టాక్. అంతేకాదు ఈ సినిమా సమంతకు బాలీవుడ్ ఎంట్రీ మూవీ కాబోతుండటం మరో విశేషం. సామ్‌కు ఇప్పటికే కథ ఇచ్చిందని, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదలవుతాయట.