”RRR సినిమాతో సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి హాలీవుడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి..’
ప్రపంచవ్యాప్తంగా ‘జేమ్స్ బాండ్’ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ సిరీస్‌లోని 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ ఇటీవలే రిలీజ్ అయి సూపర్‌హిట్ అయింది. ఈ సిరీస్‌లోని గత ఐదు చిత్రాల్లో హీరోగా నటించిన డేనియల్ క్రెగ్.. ఈ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో తర్వాతి బాండ్‌గా ఎవరు కనిపించనున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ప్రముఖ మార్వెల్ రైటర్ చియో హోదారి కోకర్ రామ్‌చరణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో సినీ అభిమానులు కన్ను రామ్ చరణ్ పై పడింది. .