స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్నా ఉత్తరాదిన మాత్రం అద్భుతాలు సృష్టించి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా రూ. 350 కోట్ల కు పైగా వసూళ్లను సాధించింది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ కనబరచిన నటనతోపాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తగ్గేదేల్యా అంటూ చూపిన మ్యానరిజం, పాటల్లో అతడి స్టెప్పులు అనుకరించనివారు లేరంటే అతిశయోక్తి లేదేమో. తెలుగుతో పాటు, హిందీలోనూ ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే పుష్ఫ మూవీ ఇప్పుడు యూట్యూబ్‌లో మరో అరుదైన రికార్డు సాధించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటిదాకా ఏకంగా 5 బిలియన్ వ్యూస్ సాధించాయి. ఇంతవరకూ మరే భారతీయ చిత్రానికీ సాధ్యంకాని ఘనత ఇది. ఈ చిత్రం సాధించిన విజయంతో పుష్ప-2 మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి రెండో భాగం మరెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలంటే మాత్రం మరో ఏడాదికిపైగా వేచి చూడాల్సిందే.