“తాత చేసిన ‘పాతాళభైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేక వీరుని కథ’ మొదలుకొని… ఈమధ్య వచ్చిన ‘బాహుబలి’ వరకు ఎన్నో సోషియో ఫాంటసీ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన మరో చందమామ కథే… మా ‘బింబిసార’ చిత్రం. ఫాంటసీ, వాణిజ్య అంశాల మేళవింపుతో సినిమా ఉంటుంది. మా చిత్రబృందం దీనికోసం చాలా కష్టపడింది. ఈ ఏడాది మా తాత ఎన్టీఆర్ శత జయంతి. ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా” అని నందమూరి కళ్యాణ్అ రామ్న్నా అన్నారు. హీరో కల్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ కథని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది తన ఆలోచన అని అన్నారు కల్యాణ్. రెండో భాగం వచ్చే ఏడాది ఆగస్టు 23కి విడుదల చేస్తామని తెలిపారు. 3, 4 భాగాలుగా కూడా రావొచ్చని, అన్నీ కుదిరితే ఎన్టీఆర్ కూడా నటిస్తారని తెలిపారు.