ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న మూవీ గురించే. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలికాలంలో ఎలాంటి ఎలాంటి వార్తలు లేవు. ఆ తరువాత మహేష్ రాజమౌళి చిత్రం కోసం లాక్ అయిపోతారు. సహజంగానే రాజమౌళి చిత్రానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి 2023లో మహేష్ నుంచి వచ్చే చిత్రం ఇదొక్కటేనని ఫిక్స్ అయిపోవచ్చు.
అయితే ఈ చిత్రం షూటింగ్ గత నెలలోనే మొదలవుతుందనుకున్నా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెల చివరి వారంలో చిత్రీకరణ మొదలుకానుందని వార్తలు వస్తున్నా ఇంకా ఎంతవరకు నిజమో తెలియదు. దీంతో ఈ చిత్రం ఎప్పటికి పూర్తవుతుందోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించి చిత్రబృందం ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకపోయినా రిలీజ్ డేట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది.
వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 28న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటన తెలుపుతోంది. ఈ మూవీకి సంబంధించి పక్కా స్క్రిప్టును డైరెక్టర్ త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నారని, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో షూటింగ్ మొదలైతే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. అందుకే ఇతర హీరోల చిత్రాలతో థియేటర్ల కోసం ఇబ్బంది రాకుండా ముందుగానే డేట్ ప్రకటించి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఇబ్బందుల కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతే సినిమాల చిత్రీకరణ పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తోంది.