‘తన సినిమా తానే చూడదట కీర్తి సురేష్..’ మహానటిగా మనందరి హృదయాలు దోచుకుంది.. కళావతిగా యువహృదయాలను కలవర పెట్టించింది. అయినా కానీ తనకెప్పుడు తన నటన సంతృప్తిని ఇవ్వలేదని చెబుతోంది కీర్తి సురేష్.. నటన మీద తనకున్న ప్యాషన్ ఇంకా బాగా చేయాలని అని ప్రతి సినిమాకు ముందు అనుకుంటుందట. నటిగా అన్ని తరహా పాత్రలు పోషించాలి.. అదే విధంగా కమర్షియల్ గాను ఆ సినిమా విజయం సాధించాలి.. అప్పుడే ఓ నటికి నిజమైన సంతృప్తి కలుగుతుంది అని అంటోంది కీర్తి. కళావతిగా కీర్తి సురేష్ అందం, అభినయం ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. పవన్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన పూజా..! విభిన్న తరహా పాత్రలు చేసినప్పుడే నటిగా తనలోని వైవిద్యాన్ని ప్రేక్షకులు చూడగలుగుతారని అంటోంది కీర్తి. నా సినిమాలు నేను చూసుకోను. అలా చూస్తే నా నటనలోనే చాలా తప్పులు కనిపిస్తాయి. ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో కలిసి కేరళ వెళతాను. నా కుక్క పిల్ల నైకీతో ఆడుకుంటాను అని చెప్పింది.