బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాధ్యానత ఇస్తారు. ఆమె నిత్యం యోగా చేస్తుంటారు. యోగ చేసే పోటోలను ఇనిస్టా లో పంచుకుంటోంది ఈ సౌందర్య రాశి.
కరీనా యోగా అందాలు అదరహో.. అంటూ నెట్ జన్లు నుంచి ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకుంటూనే ఉంది. నలభై ఏళ్ళు నిండిన ఈమె ఆహార అలవాట్లు, ఆరోగ్య సూత్రాలతో పాతికేళ్ల యువతిలా కనిపిస్తుంది. ‘ నా అందానికి ఆరోగ్య, యోగ సుత్రాల్లే కాదు.. మానసికంగా ఎపుడు దృడంగా ఉండటం కూడా..’ అని చెప్తుంది ఈ యోగ సుందరి.