ఈతరం హీరోల్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్న ఘనత నేచురల్ స్టార్ నానీది. ఇప్పుడీ ట్యాలెంటెడ్ హీరో తాజా మూవీ ‘అంటే సుందరానికీ’ జూన్ 10, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కాగా కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దాదాపు 3.3 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
నానీ సరసన కథానాయికగా మాలీవుడ్ భామ నజ్రియా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. నరేష్, రోహిణీ, నదియా, హర్ష వర్ధన్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా సాగర్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను వైజాగ్‌లో విడుదల చేసిన సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ మూవీని తీశామని, దానికి ఏ స్థాయి విజయం అందిస్తారన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారని చిత్రంపై తనకున్న నమ్మకాన్ని ప్రకటించారు. హ్యుమర్, ఎమోషన్ కోసం ఆకలిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా ఆ రెండింటిని కావాల్సినంత అందించనున్నట్టు నాని చెప్పారు.
Watch the Trailer here: