త్రిపురనేని గోపీచంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రామ బాణం’ (Rama Banam). హిట్ టాక్ అందుకుంది. అందమైన కుటుంబ కదా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు అంటే మే5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఈ సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేశారు . గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే పాత తరహా కుటుంబ కదా చిత్రంగా రావడంతో రామ బాణం గిరి తప్పినట్లే కనిపిస్తోంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి (Dimple Hayathi ) నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసారు. . ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించారు. ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి, సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తున్నారు. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.