నందమూరి కుటుంబ వారసులుగా వచ్చిన హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. టాలెంట్ మెండుగానే ఉన్నా అదృష్టం కలిసిరాక అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోతున్నారు.’బింబిసర పై ఇపుడు ఆయన అసలు పెట్టుకున్నారు. ఎప్పుడూ సరికొత్త కథలను, వైవిధ్యభరిమైన పాత్రలను ఎంచుకొని ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటారు కళ్యాణ్ రామ్. అందుకే తన కెరీర్లో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. తాను నటిస్తున్న తరువాతి చిత్రం ‘బింబిసర’లో ఓ రాజుగా కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా. అంతే కాకుండా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 5న ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవడంతో ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ట్రైలర్లో కళ్యాణ్ రామ్ లుక్‌తో పాటు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న మరొక అంశం విజువల్స్. ట్రైలర్‌కి మంచి క్రేజ్ వచ్చింది.