ఫస్ట్ మూవీ తోనే టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. ఇపుడు బాలీవుడ్ లోను తన సత్తా చాటనుండి. త్వరలోనే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ నటిని అయినా.. అతిలోక సుందరిగానే చూపిస్తారు. అలాంటి ఆయన సినిమా చేస్తే.. ఇంకా ఆ నటిపై టాలీవుడ్లో ఫోకస్ ఎక్కువవుతుంది. అలాగే శ్రీలీలపై కూడా ప్రేక్షకులు మాత్రమే కాదు.. మేకర్స్ కూడా దృష్టిపెట్టారు. అందుకే తన మొదటి సినిమా ‘పెళ్లిసందడి’ విడుదలవ్వగానే శ్రీలీల చేతిలోకి నాలుగు తెలుగు సినిమా ఆఫర్లు చుట్టిముట్టేశాయ్. ప్రస్తుతం టాలీవుడ్లోనే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీకి బాలీవుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక, పూజాలాంటి హీరోయన్లు ఇటు తెలుగుతో పాటు అటు హిందీ సినిమా ఆఫర్లు కూడా సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక శ్రీలీల కూడా త్వరలోనే ఆ జాబితో చేరేలాగా కనిపిస్తోంది. ఒక హిందీ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందట.