- షూటింగ్ బ్రేక్ లో స్కూలును సందర్శించిన నటి
- విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు బోధించిన నిత్యామేనన్
- పిల్లలతో ఇలా గడిచిదంటూ కామెంట్
దక్షిణాది సినీ నటి నిత్యామేనన్ సినిమాలు మానేసి టీచర్ అవతారం ఎత్తారెంటనుకుంటున్నారా??
ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు.. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని స్కూల్ కు వెళ్లిన నిత్యామేనన్ ఇలా టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం నిత్యామేనన్ కృష్ణాపురం అనే గ్రామానికి వచ్చారు. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లిష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు.
ఇదంతా రికార్డు చేసి నిత్యామేనన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో కొత్త ఏడాదిలో మొదటిరోజు ఇలా గడిచిపోయిందని కామెంట్ జోడించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిత్యాను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారంటూ కితాబిస్తున్నారు.