‘ప్రపంచమంతా పురుషాధిక్యం ఉంది. సినిమా పరిశ్రమలోనే దీనిపై మనం మాట్లాడటం కరెక్టు కాదేమో..’ అని తన అభిప్రాయాన్ని చెప్పింది శృతి హాసన్.
స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండదని మేల్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరని గతంలో పలువురు హీరోయిన్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సౌత్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ జాబితాలో చేరింది. సమాజం మొత్తం అలానే ఉన్నందున సినీ పరిశ్రమలో మాత్రమే ఈ వివక్ష ఉంటుందనే విధంగా చూపడం సరికాదని శృతిహాసన్ అభిప్రాయపడింది. సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమే సమాజం మొత్తం మగవారి ఆధిపత్యంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని మాత్రమే నిందించడంలో అర్థం లేడు’ అని చెప్పింది.