హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు ఆరోగ్య ప్రజ్ఞ ఎక్కువే. ఈ మధ్య ఓ చిట్ చాట్ లో తన ఫిట్నెస్ రహస్యాలు పంచుకుంది. ఆహారం గురించి, చర్మ సంరక్షణ, సౌందర్యం చిట్కాల గురించి చెప్పింది. ఆ బ్యూటీ సీక్రెట్స్ …
చిన్నప్పటి నుంచీ ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం. . నా దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదు. కాబట్టే, రోజు విడిచి రోజు డ్యాన్స్ చేస్తాను. నిజానికి నేను ఏ డ్యాన్స్ స్కూల్లో చదువుకోలేదు. కానీ, నాట్యమంటే ముందు నుంచీ ఇష్టం. ఓ డ్యాన్స్ ట్రూప్ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. అందుకే నాట్యానికి ఎంతో రుణపడి ఉంటాను. నాన్నతో పాటు రెగ్యులర్ గా యోగాసనాలు వేసేదానిని. ఇప్పటికీ నేను బరువులెత్తుతాను. పుషప్స్, స్కాట్స్ చేస్తాను. . రోజూ ఓ గంట వ్యాయామానికి కేటాయిస్తాను. ఇంటి భోజనం ఇష్టపడతాను. కానీ జంక్‌ఫుడ్ నచ్చదు. అలా అని కఠిన ఆహార నియమాలేం పాటించను. కొవిడ్ లాక్డౌన్ సమయంలో కొంత బరువు పెరిగాను. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు. భారతీయ వంటకాలకు తిరుగులేదు. బయటి రుచులలో జపనీస్ ఇష్టం.
నా చర్మ సంరక్షణ గురించి చెప్పాలంటే.. రోజూ క్లెన్సింగ్ (ఏదైనా ద్రవంతో శుభ్రపరచడం) చేసుకుంటాను. తర్వాత టోనర్ ఐప్లె చేసి, మాయిశ్చరైజర్ రాసుకుంటాను. బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ వాడతాను. నీళ్లు ఎక్కువగా తాగుతాను.