చేసింది తక్కువ సినిమాలే అయినా గీతగోవిందం, అర్జున్‌రెడ్డి వంటి సంచలన విజయాలతో స్టార్డమ్ తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ. హీరోలను తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్‌తో మరో స్థాయిలో చూపించే సీనియర్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబోలో తొలిసారిగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్యపాండే కథానాయికగా మెరవనుంది. కీలక పాత్రలో ఒకప్పటి ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్‌టైసన్ నటిస్తుండటం విశేషం. గురువారం ఆయనకు ఘనంగా బర్త్‌డే విషెస్ తెలిపిందీ చిత్ర బృందం.
ఇప్పటికే అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్న ఈ చిత్రానికి నటి ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. కాగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు ఈ మూవీ టీం సన్నాహాల్లో ఉంది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ “కమింగ్” అంటూ ట్వీట్ చేయడం దీనినే సూచిస్తోంది. ఇకనుంచి వరుస అప్డేట్లతో ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ ప్రమోషన్స్ ను చూడబోతున్నట్టు అనుకోవచ్చు.