Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home అంతర్జాతీయం

సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం

V Srinivas by V Srinivas
August 3, 2022
in అంతర్జాతీయం
సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం

 డ్రాగన్ కంట్రీ  చైనా మరో దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోందా? ద్వీప దేశం శ్రీలంక సముద్ర జలాల్లో నుంచి మన దేశంలో ఆరు పోర్టులపై నిఘా పెట్టడానికి కుయుక్తులు పన్నుతోందా?

ఈ ప్రశ్నకు రక్షణ రంగ నిపుణుల నుంచి ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది. డ్రాగన్‌ దేశానికి చెందిన నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’ గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయానికి వెళుతున్నట్లు కథనాలు వెలువడడమే ఇందుకు కారణం. ఈ నెల 11 నుంచి 17 వరకు ‘యువాన్‌ వాంగ్‌ 5’ హంబన్‌టొట వద్ద ఉంటుందని శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే ధ్రువీకరించింది కూడా.

భారత్‌ ఆందోళన  
‘యువాన్‌ వాంగ్‌ 5’ క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలో గల  కీలక  సంస్థల రహస్య  సమాచారాన్నీ సేకరించగల సామర్థ్యం ఉంది.

శ్రీలంకలో చాన్నాళ్లుగా అధికారంలో ఉంటూ ఇటీవలే పదవీచ్యుతులైన రాజపక్స కుటుంబం సొంత నగరం హంబన్‌టొట. ఇక్కడి నౌకాశ్రయాన్ని చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని నిర్మించారు. వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పోర్టు అత్యంత కీలకమైనదిగా చెబుతుంటారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో హంబన్‌బొట నౌకాశ్రయాన్ని చైనా మర్చంట్‌ పోర్ట్‌ హోల్డింగ్స్‌కు లీజుకు ఇచ్చింది. దీంతో డ్రాగన్‌ దేశం ఈ పోర్టును సైనిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశముందనే ఆందోళనలు మొదలయ్యాయి. 2014లో కొలంబో పోర్టులో ఉంచిన చైనా జలాంతర్గామి కంటే.. ఈ నౌక మరింత శక్తిమంతమైనదిగా చెబుతున్నారు.

భారత్‌ అభ్యంతరం..

చైనా నౌక విషయమై కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళనను, అభ్యన్తరాన్ని  తెలియజేసింది.  కీలక  అధికారులు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన చైనా.. తన చట్టబద్ధమైన సముద్ర కార్యకలాపాల్లో సంబంధిత పార్టీలు కల్పించుకోకుండా ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇది పూర్తిగా తమకు సంబందించిన వ్యవహారంగా చైనా అభివర్ణించుకుంటోంది.

Tags: Yuan wang 5 ship
ShareSendShareTweet
Previous Post

ఇక అంబెడ్కర్ కోనసీమ జిల్లా

Next Post

ఏమి నైపుణ్యం.. సబ్బుపై పింగళి వెంకయ్య

Related Posts

సేఫ్ గా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు
అంతర్జాతీయం

సేఫ్ గా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

June 5, 2023
ఎల్‌నినో ఎఫెక్ట్… 2027 వరకు భూగోళమంతా తీవ్ర వేడి: ఐక్యరాజ్య సమితి
అంతర్జాతీయం

ఎల్‌నినో ఎఫెక్ట్… 2027 వరకు భూగోళమంతా తీవ్ర వేడి: ఐక్యరాజ్య సమితి

May 18, 2023
విడాకులు తీసుకోనున్న ఫిన్‌లాండ్   మహిళా ప్రధాని
అంతర్జాతీయం

విడాకులు తీసుకోనున్న ఫిన్‌లాండ్ మహిళా ప్రధాని

May 11, 2023
Next Post
ఏమి నైపుణ్యం.. సబ్బుపై పింగళి వెంకయ్య

ఏమి నైపుణ్యం.. సబ్బుపై పింగళి వెంకయ్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

అమెరికాలో కొత్త వైరస్… దేశవ్యాప్తంగా వ్యాప్తి..

అమెరికాలో కొత్త వైరస్… దేశవ్యాప్తంగా వ్యాప్తి..

by V Srinivas
June 2, 2023

రైలు ప్రమాదానికి  అదే కారణం?

రైలు ప్రమాదానికి అదే కారణం?

by V Srinivas
June 3, 2023

సేఫ్ గా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

సేఫ్ గా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

by V Srinivas
June 5, 2023

చంద్రబాబు ఇరుక్కుంటున్నారు?

చంద్రబాబు ఇరుక్కుంటున్నారు?

by V Srinivas
June 4, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved