‘అమెరికాలో ఎపుడైనా భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయనేది ఇపుడు నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశం ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోంది..’
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 0.9 శాతం మేర వృద్ధిరేటు తగ్గింది. మొదటి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధిరేటు తగ్గింది.
ఏదైనా ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి రేటు వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గుముఖం పడితే దాన్ని ఆర్థికమాంద్యంగా పరిగణిస్తారు. తాజా గణాంకాలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని., కొంతమేర మారే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాంద్యం విషయంలో ఇప్పుడే.. ఒక అభిప్రాయానికి రాలేమని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం కూడా దేశ ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని చెబుతోంది. లేబర్ మార్కెట్, కార్పొరేట్, వ్యక్తిగత వినియోగ శక్తి బాగానే ఉందని తెలిపింది. అయితే రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో వృద్ధి రేటు తిరోగమనలోకి వెళ్ళింది. ఇలాంటి పరిణామాలు మాంద్యం ప్రమాద సూచికను గుర్తుచేస్తున్నాయ్.