ఎలన్ మస్క్ మరో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నారు. అతడి కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంలో అద్బుత విజయాలు సాధించింది. ఇప్పుడు మరో ఘనవిజయం సాధించింది. దీంతో ఎలన్ మస్క్ మరో సారి ప్రపంచం తనవైపు చూసేలా చేరనే చెప్పాలి. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్ దగ్గరకే చేర్చి ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్ నుండి ఈ చారిత్రాత్మక టెస్ట్ నిర్వహించారు. అపోలో ప్రోగ్రాం సాటర్న్ వి కంటే రెట్టింపు శక్తి కలిగిన బూస్టర్ రాకెట్ ఆదివారం తెల్లవారుజామున ఆకాశంలోకి నీలిరంగు జ్వాలలు చిమ్ముతూ నేలపైకి దూసుకువచ్చింది. వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన బూస్టర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఆకాశం నుంచి వచ్చిన రాకెట్ బూస్టర్‌ను.. లాంచ్‌ప్యాడ్ దగ్గర ల్యాండ్ చేశారు సైంటిస్టులు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో ప్రయోగాలు నిర్వహిస్తున్న స్పేస్ ఎక్స్ మరి సరికొత్త ప్రయోగంతో చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్, 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకే వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్ కావడం ఇదే తొలిసారి
రాకెట్ బూస్టర్లను తిరిగి రప్పించడం స్పేస్ ఎక్స్‌కు కొత్తేమీ కాదు. ఉపగ్రహాలు, వ్యోమగాములను కక్ష్యలో ప్రవేశపట్టిన తర్వాత భూమికి తిరిగొచ్చే ఫాల్కన్-9 రాకెట్లకు ఉండే బూస్టర్లను తొమ్మిదేళ్లుగా రికవరీ చేస్తూనే ఉంది. అయితే మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ప్లాట్ ఫామ్‌లమీద లేదా కాంక్రీట్ శ్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భూమి మీద ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌లో ల్యాండ్ కావడం మాత్రం ఇదే తొలిసారి.