Russia: అమెరికాపై రష్యా దాడిచేసే అవకాశం.. యూఎస్

రష్యా తమపై దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్సు వర్గాలు చెప్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ ల మధ్య సుమారు వెయ్యిరోజుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. అణ్వాయుధాలను ప్రయోగించే నిబంధనలను సరళతరం చేసే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు.

ఈ క్రమంలో రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అలెర్ట్ చేసింది. అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న డిఫెన్స్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సదరు కంపెనీలు రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని సూచించింది.