బ్రిటన్ ప్రధానిగా.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత భారత సంతతికి చెందిన మాజీ మంత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు.. రిషి సునాక్ ఎంపిక అవుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో ఇద్దరు ప్రత్యర్థులను ఎన్నుకుంటారు. అసలు ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉండటానికి నిర్దిష్టంగా 20 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని పదవికి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి రౌండ్ ఓటింగ్లో రిషి సునాక్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఓటింగ్ ట్రెండ్ ను పరిశీలిస్తే రిషి కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.