ఉత్తర కొరియాలో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాలా మంది జ్వరాలబారిన పడుతున్నారు. బ్లడ్ టెస్టులు చేయగా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. నార్త్ కొరియాలో శుక్రవారం ఒక్కరోజే 1,74,440 మందికి జ్వరంసోకింది. 21 మంది మరణించారు. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా మొత్తం 5,24,440 మంది కోవిడ్ బారిన పడ్డారు. 2,80,800 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం. కరోనా కట్టడి చేయడంలో అధికారుల తీరుపై దేశ అధ్యక్షుడు కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాలుగా అభివర్ణించారు. ప్రజలు, ప్రభుత్వం ఈ వైరస్ ను వీలైనంత త్వరగా కట్టడి చేయాలన్నారు. కరోనాను కట్టడి చేయలేకపోతే ఉత్తర కొరియా తీవ్రమైన పర్యవసనాలను ఎదుర్కోవలసి వస్తుందని అక్కడి నిపుణులు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో ఒక మరణమే సంభవించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది నార్త కొరియా ప్రభుత్వం.