ప్రధాని నరేంద్ర మోడీ పై బీబీసీ డాక్యుమెంట్ తీవ్ర వివాదానికి తెరలేపింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా బీబీసీ తీరుపట్ల వ్యతిరేఖత వ్యక్తం చేస్తోంది.
బీబీసీ సంస్థ ఇన్ఫర్మేషన్ వార్‌కు పాల్పడుతున్నట్లు రష్యా ఆరోపించింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆ అంశంపై రష్యా స్పందించింది. అన్ని రంగాల్లోనూ బీబీసీ సమాచార యుద్ధానికి దిగుతున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకరోవా తెలిపారు. రష్యాపై మాత్రమే కాదు, ఇతర దేశాలపై కూడా బీబీసీ వార్తా సంస్థ సమాచారా యుద్ధానికి పాల్పడుతున్నట్లు జకరోవా ఆరోపించారు.