ఏదైనా కంపెనీలో ఓ ఉద్యోగి మహా అయితే పదేళ్లు.. ఇంకా అనుకుంటే ఓ ఇరవై, పాతికేళ్ళు పనిచేయడం సహజం. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపు కోసం సంస్థలు మారుతుండటం ఎక్కడైనా సర్వ సాధారణం కానీ, ఓ పెద్దాయన తన ఉద్యోగ జీవితంలో ఒక్క కంపెనీ లోనే పనిచేసారు. ఒకే ఒక్క కంపెనీలో 84 ఏళ్లు ఉద్యోగిగా పనిచేశారంటే నమ్మ శక్యమా? కానీ, నమ్మి తీరాలి. ఎందుకంటే.. ఆ ఘనతకు గిన్నిస్ బుక్.. వరల్డ్ రికార్డు వారు కూడా గుర్తించారు.
ఇటీవలే వందేళ్లు వయసు దాటిన ఆ పెద్దాయన పేరు వాల్టర్ ఆర్థమాన్. బ్రెజిల్ లోని బ్రస్క్యూ అనే ఓ చిన్న పట్టణం ఈయన సొంతూరు.. 1938లో 14 ఏళ్ల ప్రాయంలో ఆ సంస్థలో షిప్పింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం ప్రారంభించిన న వాల్టర్.. అంచెలంచెలుగా ఎదిగారు. షిప్పింగ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ పొజిషన్ కు, అక్కడి నుంచి సేల్స్ మేనేజర్ గా పదోన్నతి సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 19నే వాల్టర్ వందో ఏడులోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తాను పనిచేసిన సంస్థ సిబ్బంది స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు. దేని గురించీ పెద్దగా టెన్షన్లు తీసుకోనని, తనకు రేపు అంటే మరో రోజు అని చెప్పుకొచ్చారు వందేళ్ల వయసులోనూ ఆరోగ్యాంగా జీవితాన్ని సాగిస్తున్న వాల్టర్ ఆర్థమాన్.