అనంత విశ్వంలో భూమిపై కాకుం డా మరే గ్రహంపైనైనా జీవం ఉందా? మానవ జాతి మనుగడకు అనువైన వాతావరణం ఉన్న గ్రహం మరొకటి ఉందా? అని ఖగోళ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కెనడాకు చెందిన మాంట్రియల్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం మన సౌర వ్యవస్థ వెలుపల భూమిని పోలిన, భూమికంటే పెద్ద గ్రహాన్ని కనుగొంది. ఇది మన భూమి కంటే 70 రెట్లు పెద్దదని, సుమారు ఐదు రెట్లు బరువైనదని తెలిపారు. దీనిపై కూడా లోతైన మహాసముద్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గ్రహంపై ఒక సంవత్సరం అంటే 11 రోజులేనని చెబుతున్నారు. మహా భూమి (సూపర్ ఎర్త్)గా భావిస్తున్న ఈ గ్రహానికి పరిశోధకులు టీవోఐ-1452బీ అని పేరుపెట్టారు.
మన భూమికి సుమారు 100కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ సూపర్ఎర్త్ రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎ్సఎస్), భూ ఆధారిత టెలిస్కో్పల పరిశీలన సమయంలో ఈ గ్రహాన్ని గుర్తించారు. అయితే, ఇది హైడ్రోజన్, హీలియం వాతావరణంతో కూడిన రాతి గ్రహం కూడా కావొచ్చని, దీనిపై వాతావరణం తక్కువగా ఉండొచ్చని, లేదంటే అసలు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.