పోప్ బెనడిక్ట్ అంతిమయాత్ర ఇవాళ మొదలైంది. ఆయన పార్దీవ దేహాన్ని ఉంచిన శవపేటికను గురువారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్కు తీసుకువచ్చారు. అంతిమ వీడ్కోల్లో పాల్గొనేందుకు అక్కడికి సుమారు 60 వేల మంది చేరుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సజీవంగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్.. దివంగత పోప్ బెనడిక్ట్కు అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆధునిక చరిత్రలో ఓ అసాధారణ ఘట్టమని క్రైస్తవ పెద్దలు చెబుతున్నారు. యూరోప్ దేశాలకు చెందిన రాజకుటుంబీకులు, వేలాది మంది క్రైస్తవ పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సెయింట్ పీటర్స్ బాసిల్లికాలో పోప్ బెనడిక్ట్ను ఖననం చేస్తారు. అక్కడ సుమారు 90 మంది పోప్ల శవపేటికలు ఉన్నాయి. 95 ఏళ్ల పోప్ బెనడిక్ట్ శనివారం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. 2013లో బెనడిక్ట్ అనార్యోగ కారణాల వల్ల పోప్గా రిజైన్ చేశారు. గత 600 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.