‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు..’ తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఆరోపించారు. అమెరికా ఇలాగే కవ్వింపు చర్యలకు పాల్పడితే అణుబాంబులకు పనిచెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ సమయంలోనైనా అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎవరు అడ్డొచ్చినా తమను ఆపలేరని కిమ్ ప్రకటించారు.