తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో విశేష కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.
‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ అమెరికా’ ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు’’ అని ట్రంప్ ఆనందంగా వ్యక్తం చేసారు .