”ఏ ఇద్దరు స్నేహితులు బయట కలిసినా.. కబుర్లు చెప్పుకుంటూ ‘టీ’ తాగడం అలవాటు. అలాగే ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినా వెంటనే స్టవ్ వెలిగించి టీ పెట్టడం మూడు దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం..”
టీకి సాటి మరే పానీయం ఉండదు. ఇదొక ఎమోషన్ అని చాలా మంది భావన. ఎందుకంటే, టీ మన దేశంలో ప్రతి గల్లీలో.. అర్థరాత్రి అయినా చీప్ కాస్ట్లో దొరుకుతుంది. ఉదయమైనా, సాయంత్రమైనా.. టీ తాగుతుంటే మనసుకు హాయిగా ఉంటుంది. మన అలసట తీరి.. మళ్లీ చురుకైపోతాం. శీతాకాలంలో టీ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ.. టీ సిప్ చేస్తూ ఉంటే వచ్చే ఆనందమే వేరు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యయనం ప్రకారం టీ అలవాటున్న వారికి ఆలోచనాశక్తి, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతల నమ్మదిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఓ డచ్ అధ్యయనం ప్రకారం రోజూ కనీసం మూడు కప్పులు టీ తాగే వాళ్లలో హృద్రోగ ముప్పు తాగని వారికంటే 45 శాతం తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది టీ ప్రియులు.. ఒక రోజులోనే కప్పుల కొద్దీ టీలు లాగించేస్తూ ఉంటారు.
మితం తప్పితే డేంజరే?
టీ పరిమితికి మించి తాగితే.. అనారోగ్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. NCBI ప్రకారం, టీలో ఉండే కెఫిన్ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణం అవుతుంది. ఇందులో ఉండే అసిడిక్ గుణాలకు పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ఉంది. అందుకే ఎక్కువ మోతాదులో, ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం, తక్కువ టీ తాగే వారి కంటే రోజువారీ అవసరానికి మించి టీ తాగేవారిలో రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిద్రా భంగం
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్ర సైకిల్‌కు భంగం కలిగే అవకాశం ఉంది. టీలో ఉండే కెఫిన్.. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ చర్యను అడ్డుకుంటుంది. మెలటోనిన్.. మెదడుకు విశ్రాంతి ఇస్తుంది. దీని కారణంగా నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది.
కేన్సర్ వచ్చే ప్రమాదం.. టీ రెగ్యులర్ గా తాగే వారిలో దీర్ఘ కాలంలో కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. టీ లో ఎక్కువగా వినియోగించే పంచదార వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుందని పలు పరిశోధనలలో వెల్లడైంది.