టీ, కాఫీలతో పాటు… రస్క్ కూడా తీసుకుంటున్నారా…బ్రెడ్, రస్క్‌లు రెండూ శుద్ధి చేసిన పిండితో తయారు చేయబడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లలో చాలా ఎక్కువగా ఉంటాయి. కార్బొహైడ్రేడ్లను అధిక మొత్తంలో తింటే శరీర బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్‌లను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచేస్తుంది.
అయితే వైట్ బ్రెడ్ లేదా కేక్‌లతో తయారు చేసిన రస్క్‌ల కంటే హోల్-వీట్ రస్క్ మంచి ఎంపిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లను అందిస్తుంది. ఈ రెండూ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. హోల్-వీట్ రస్క్‌లో మాంగనీస్,సెలీనియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.