చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు.. గుండె పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి గుమ్మడి గింజలు.
- ఇందులో చాల ఎక్కువగా “బీటా కెరోటిన్ ఉంటుంది ,
- శరీరానికు తక్కుకా క్యాలరీలు అందిస్తుంది .
- కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది .
- ఇందులో విటమిన్ సి కుడా అధికంగా లభిస్తుంది .
- డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది .
- బి.పి.ని నియంత్రిస్తుంది ,
- పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది ,
- గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాదుఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తరచూ గుమ్మడి గింజలు తినడం మంచిది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
గుమ్మడికాయ గింజలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. గుండెను సురక్షితంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు ప్రబావవంతంగా పనిచేస్తాయి. కాని ఇది కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు ఈ విత్తనాలను పారేస్తుంటే మాత్రం ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ..ఇవి మీకు ఖచ్చితమైన ప్రయోజనం చేకూరుస్తాయని గుర్తుంచుకోండి. డయాబెటిక్ రోగులకు గుమ్మడికాయ గింజలు ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. ఇది కాకుండా ఈ విత్తనాలు అనేక ప్రధాన వ్యాధుల నుంచి కాపాడుతాయి.
గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సహజంగానే ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహ సమస్యను దూరం చేయడంలో గుమ్మడి గింజలు చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. నిజానికి యాంటీ డయాబెటిక్ లక్షణాలు గుమ్మడి గింజలలో కనిపిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఈ మసాల దినుసు బరువు తగ్గించడంలో సూపర్..! దీంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెంచడంలో గుమ్మడి విత్తనాలు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల కండరాలు, ఎముకల నొప్పి, జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించేందుకు సహాయపడుతాయి.