ఉదయం టీ / కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఇక ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగకపోతే కొందరికి అసలు ఏమీ తోచదు. తీ-కాఫీ లు మన దైనందిన జీవితంలో అంతలా కలసిపోయాయి. అయితే టీ విషయానికి వస్తే ఇందులోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో లెమన్ టీ ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ టీ కన్నా రెగ్యులర్ గా లెమన్ టీ తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. లెమన్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అదిక బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ సాధారణ టీకి బదులుగా లెమన్ టీని తాగితే ప్రయోజనం ఉంటుంది. లెమన్ టీ శరీరంలోకి ప్రవేశించగానే మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది. మెరుగైన జీవక్రియలకు సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది .
.