మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపకపోతే మనం ఒక్కరోజు కూడా బ్రతకలేం. శరీరం సక్రమంగా పని చేయాలంటే మూత్రపిండాలు నిరంతరంగా పని చేయాలి. నిత్యం ఎన్నో రకాల రసాయనాలు, లవణాలను, వ్యర్థాలను వడపోసి మూత్రపిండాలు బయటకు పంపిస్తూ ఉంటాయి. మానవ ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చిన్న చిట్కా…ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా మూత్రపిండాలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, మలినాలు తొలిగిపోతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావల్సింది కొత్తిమీర. దీనిని మనం ఎక్కువగా వంటలల్లో వాడుతూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల మనం చేసే వంటల రుచి, వాసన పెరుగుతుందని చెప్పవచ్చు. కొత్తిమీరతో కొత్తిమీర రైస్, కొత్తిమీర పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు వంటల్లో కొత్తిమీర వేసిన వేయకపోయిన కూడా ఏం కాదులే అని భావించి పక్కకు పడేస్తూ ఉంటాం.
కానీ కొత్తిమీర రుచికి, సువాసనకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొత్తిమీరలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగలో ఒక టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి రాత్రిపూట తీసుకున్నట్టయితే శరీరానికి కావల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. ఎముకలు ధృఢంగా ఉంటాయి. పేగు పూత, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడే వారు పెరుగులో కొత్తిమీరను కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చిగుళ్ల సమస్యలు ఉన్న వారు, నోటిదుర్వాసనతో బాధపడే వారు కొత్తిమీర ఆకులను నమిలి మింగితే ఆయా సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
కొత్తిమీరను నీళ్లలో వేసి.. 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత దీనిపై మూతను ఉంచి నీటిని చల్లారనివ్వాలి. నీరు చల్లారిన తరువాత వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. వారానికి ఒకసారి ఒక గ్లాస్ మోతాదులో ఈ కొత్తిమీర నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి.
ఈ జ్యూస్నీ తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక గర్భిణీ స్త్రీలు రోజూ 2 టీ స్పూన్ల కొత్తిమీర రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మూత్రపిండాలను శుబ్రపరుచుకోవడానికి ఈ కొత్తిమీర ఎంతగానో సహాయపడతాయి. మూత్రపిండాల పనితీరుపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.