మారుతున్న ఆహార అలవాట్ల వల్ల అనారోగ్యాలు కొని తెచుకుంటున్నాం. పట్టణ , నగర వాసులలో ఈ అలవాట్లు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. చిన్నపాటి శారీరక వ్యాయామం లేకుండా పోతోంది. దీంతో మూడు పూటలా తినే తిండి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. ఇందులో ట్రై గ్లిజరైడ్స్ అనేవి చెడ్డకొవ్వులు. అవి చాలా ప్రమాదకరమైనవి.
..లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీరు కొలెస్ట్రాల్ లెవల్స్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కూడా చూసి ఉంటారు. చెడు కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమో ట్రైగ్లిజరైడ్స్ కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు చెబుతారు. . ట్రైగ్లిజరైడ్స్ వల్ల మనకు హాని ఏంటి? ఏం తింటే తగ్గుతాయి? ఏం తినకూడదు?
పర గడుపున ఇచ్చే రక్త నమూనా ద్వారా మనం ‘లిపిడ్ ప్రొఫైల్’ టెస్ట్ చేయించుకోవాలి. ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో పాటు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండే ఫ్యాట్ మాలిక్యుల్స్. లెవెల్స్ 150 మి.గ్రా./డెసిలీటర్ వరకు ఉంటే పరవాలేదు. 150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 500, ఆపై ట్రైగ్లిజరైడ్స్పై ఉంటే అత్యధికంగా ఉన్నట్లు లెక్క. 500-600 ఉంటే డేంజర్ లెవిల్.
డయాబెటిస్ తో డేంజర్ 30 ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ ట్రైగ్లిజరైడ్స్ చెక్ చేసుకోవడం మంచిది. . మన రక్తంలో ఇవి పెరగడానికి కారణాలేంటంటే మనం తీసుకునే ఆహారం ఒకటైతే, లివర్ ద్వారా ఉత్పన్నమవడం మరొకటి. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడ్డ వారిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి.
కార్బొహైడ్రేట్స్
మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. కార్బొహైడ్రేట్స్ రెండు రకాలు. ఒకటి సాధారణ కార్బొహైడ్రేట్స్, రెండోది సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్. సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ శరీరానికి నిదానంగా శక్తినిస్తాయి. కానీ సింపుల్ కార్బొహైడ్రేట్స్ లేదా రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తాయి. జంక్ ఫుడ్.. బర్గర్లు, పాస్తా, ప్యాకేజ్డ్ డ్రింక్స్ వంటి రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం ప్రమాదమని వైద్యులు సెలవిస్తున్నారు.
మద్యం తీసుకునే వారిలో, పొగ తాగే వారిలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. మన శరీరం గ్లూకోజును, ట్రైగ్లిజరైడ్స్‌ను శక్తిరూపంలోకి మార్చుకుంటుంది. కానీ ట్రైగ్లిజరైడ్స్ అంత తేలికగా శక్తిగా మారవు. చెడు కొలెస్ట్రాల్ రూపంలోకి మారుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతాయి.
పెరిగితే నష్టం ఇలా..
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ (LDL ) ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ట్రైగ్లిజరైడ్ కొవ్వులు పెరగడానికి మద్యపానం, పొగ తాగడం, కాలేయ జబ్బులు, ఊబకాయం వంటి అనేక అంశాలు కారణమవుతాయి. అందువల్ల ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకుంటే చాలా వరకు ట్రైగ్లిజరైడ్స్తపెరగకుండా కంట్రోల్గ్గిం చేసుకోవచ్చు.
ఆహారంతో హాయి.. కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తూ.. పండ్లు, కూరగాయలు ఆహారంలో ఎక్కువగా చేసుకోవడం చెడు కొవ్వులు నుంచి బయటపడవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఉప్మా, డోసే , ఇడ్లీ, వడ వంటి టిఫిన్స్, తెల్లటి అన్నం, బ్రెడ్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ , కూల్ డ్రింక్స్ వంటివి అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని ఎంత తగ్గిస్తే ట్రై గ్లిజరైడ్స్ అంత కంట్రోల్ లో ఉంటాయని గుర్తుంచుకోవాలి.
గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు,, బాదం పప్పు వంటివి 6-8 గంటలు నానబెట్టి తింటూ ఉండాలి. అలాగే జామ, బొప్పాయి., వంటి పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం.. అవిసె గింజలు, నువ్వులు వంటివి కూడా నానబెట్టుకుని తినడం కూడా ట్రైగ్లిజెరైట్స్ తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడం ఏంతో ప్రయోజనం.. అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.