పెసలతో పెసరెట్టు చేసుకుంటామని చాలామందికి తెలుసు. అలాగే పెసర పప్పు, చారు కూడా దక్షిణాదిలో సాంప్రదాయ వంటకాలే. అయితే మొలకెత్తిన పెసలు తింటే వీటన్నిటి కంటే అధికమైన ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయట.
పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పొషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెప్తారు. పెసలను రోజూ నీటిలో నానబెట్టి అనంతరం మొలకెత్తించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మొలకెత్తిన పెసలలో విటమిన్లు ఎ, బి, సి, ఇలు అధికంగా ఉంటాయి. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.పెసలను రోజూ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, కాపర్, ఫోలేట్, ఫైబర్లు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. పైగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరిగి, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.పెసలను తినడం వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి. వీటితో శరీర నిర్మాణం జరుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో పేగులు శుభ్రంగా మారుతాయి. తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు రోజూ పెసలను తింటే ఆకలి అదుపులోకి వస్తుంది.