ఆవుపాలు అమ్మపాల కంటే శ్రేష్ఠమని.. పూర్వం నుంచి భారతీయుల నమ్మకం. అయితే అవి ఆరోగ్యకరమైనవేనా? కాదా? అనేదానిపై శాస్త్రీయ రుజువులు లేదు. దీనిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ అంశంపై పోషకాహార నిపుణులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నివేల ఏళ్ల క్రితం ఆవుల పెంపకం మొదలైనప్పటి నుంచి వాటి పాలను, ఉత్పత్తులను మానవులు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. పది వేల ఏళ్ల క్రితం నుంచి అది కొనసాగుతోందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే జీవితాంతం ఈ పాలు తాగడం వల్ల ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం కూడా ఉందన్న వాదనలు ఉన్నాయి.
అయితే కొన్నేళ్లుగా ఆవుపాల వినియోగం క్రమంగా తగ్గుతోంది. అమెరికా వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఆ దేశంలో 1970 నుంచి ఆవుపాల వినియోగం 40 శాతం తగ్గింది. సోయా, బాదం పాలు లాంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం కూడా ఆవు పాల వినియోగం తగ్గుదలకు ఒక కారణంగా ఉంది. చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రజలు ఆవుపాల వినియోగాన్ని తగ్గించడానికి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా కారణమే. పూర్తిగా శాఖాహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే వీగన్ డైట్‌కు ఆదరణ పెరగడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచ జనాభాలో దాదాపు 65 శాతం మందిలో లాక్టోస్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. లాక్టోస్ అంటే పాలలో ఉండే ఒక రకమైన చక్కెర పదార్థం. ఆవు పాల వినియోగం తగ్గడానికి ఇది కూడా ప్రధాన కారణం.
ఎంత ఆరోగ్యం అంటే…
ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్లు లభిస్తాయని యూకేలోని నేషనల్ హెల్త్ చెబుతోంది. అంతేకాదు ఆవు పాలలో ఏ, డీలతో సహా అనేక రకాల విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డోనల్డ్ హెన్స్‌రూడ్ స్పష్టం చేశారు. ఆవు పాలు చక్కని పోషక విలువలు కలిగిన ఆహారమని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని హెన్స్‌రూడ్ వివరించారు. సాధారణంగా పెద్దవారు, యువకులకు అవసరమైనంత మోతాదులో ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్, అయోడిన్ అందవు. వారు ఆవుపాలు తాగితే ఆ పోషకాలన్నీ లభిస్తాయని బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ తెలిపింది.
ఆవుపాలలో సహజంగానే పోషకాలు ఉంటాయి. కాని బాదం, సోయా వంటి ప్రత్యామ్నాయ పాలలో వాటిలో కృత్రిమ పద్ధతిలో చేరుస్తారు. కాబట్టి ఆశించిన విధంగా ఆ పోషకాల ప్రభావాలను పొందలేరని పోషకాహార నిపుణుడు షార్లెట్ స్టిర్లింగ్-రీడ్ చెబుతారు. ఆవు పాలు వ్యాయామం చేసేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. “కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఖచ్చితమైన నిష్పత్తిలో ఉండే సంపూర్ణ ఆహారం ఆవు పాలు. కండరాల పునరుద్ధరణను ఉత్తేజపరిచేందుకు ఈ పాలు చాలా ఉపయోగపడతాయి” అని పోషకాహార నిపుణుడు రెనీ మెక్‌గ్రెగర్ నిర్ధారించారు.
పిల్లల కావాల్సిన కాల్షియం ఈ పాల ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. గర్భిణులకు కూడా ఈ పాలను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే పిండం, ఎముకలు ఏర్పడేందుకు… ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడతాయి. 300 మిల్లిలీటర్ల పాలలో 350 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. అయితే ఏడాది లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదని ఎన్హెచ్ఎస్ సిఫార్సు చేసింది.
ఆవు పాలలో అధిక కొవ్వు..
ఆవుపాలతో పెద్ద సమస్య ఏమిటంటే దానిలోని కొవ్వు పదార్థం. పెద్దవాళ్లకు విటమిన్లు, ఐరన్ అందేది పాల ద్వారానే కాని తప్పకుండా తగ్గించాలని హెన్స్‌రూడ్ చెప్పారు. అలాగే, వెన్న, నెయ్యి, పెరుగు తీసుకోవడంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఉదాహరణకు, సాధారణ వెన్నలో 20 నుంచి 40 శాతం వరకు కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అనేక దేశాలలో 100 గ్రాముల ఆహార పదార్థంలో 17.5 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు ఉంటే అధిక కొవ్వు కలిగిన ఆహారంగా దాన్ని వైద్య సంస్థలు గుర్తించాయి.
పాలలో కొవ్వు కారణంగా మరొక సమస్య కూడా ఉంది. అదే అసంతృప్త లాక్టోస్. ఇది ప్రపంచంలో మరింతగా పెరుగుతోంది. ఆవు పాలతో వచ్చే ఆరోగ్య సమస్య ఏమిటంటే ఇది కొందరిలో అలెర్జీకి కారణమవుతుంది. ఇంగ్లండ్‌లో ప్రతీ 50 మంది పిల్లల్లో ఒకరికి ఆవు పాలు తాగడం వల్ల అలెర్జీ వస్తుందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది. మరో వాస్తవం ఏమిటంటే మానవుడు తప్ప ఏ జంతువు పెద్దయ్యాక పాలు తాగదు. పాల వల్ల ఆసియాలో అత్యధిక మంది జీర్ణక్రియ, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో నేడు అధిక భాగం లాక్టోజ్ లేని పాలే ఉత్పత్తి అవుతున్నాయి. కాల్షియం, విటమిన్లు లభించే పౌష్టిక పదార్థంగా పోషకాహార నిపుణులు పాలను సూచించినప్పటికీ వాటి వాడకం వివాదాస్పదమవుతూనే ఉంది.