బ్లాక్ టీ … గ్రీన్ టీ, లెమన్ టీ , హెర్బల్ టీ., విన్నాం కానీ, బ్లాక్ టీ.. ఏంటనుకుంటున్నారా?
ఇది కామెల్లియా సినెసిస్ అనే మొక్క ఆకుల పొడి ద్వారా తయారవుతుంది. ఇది పలు రంగుల్లో ఉంటుంది. ఈ టీ ఇతర టీల కంటే చాలా ఓషద గుణాలున్నది. చిక్కటి ముదురు రంగులో ఉంటుంది కాబట్టి దీనికి బ్లాక్ టీ అనే పేరు వచ్చింది. కాఫీతో పోల్చుకుంటే ఇందులో చాలా తక్కువ మోతాదుతులో కెఫిన్ ఉంటుంది. బ్లాక్ టీని తాగితే మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
జీర్ణక్రియ మెరుగవుతుంది
వెయిట్ లాస్ మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్ టీ దోహదం చేస్తుంది. బ్లాక్ టీ పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా జీర్ణక్రియ రేటు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది. బ్లాక్ టీలోని పాలీఫినోల్స్ మెటబాలిజమ్ పెరగడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్
బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్ అనే యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది రొమ్ము కేన్సర్ ని నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్ టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో వివిధ రకాల క్యాన్సర్ లు రావు. ఉదరం, పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది. వెంటనే ఈ అలవాట్లు మానేయండి.. లేదంటే కడుపులో పెద్ద సమస్యే రావచ్చు .. డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది బ్లాక్ టీ లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేగులకు సంబంధించిన సమస్యలను ఇది పరిష్కరించగలదు. డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు.
బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది
శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడే జ్యూస్ లు బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఆస్తమా వేడివేడిగా ఉండే ద్రవాలను తాగటం వల్ల ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అయితే బ్లాక్ టీ శరీరంలోకి ఎక్కువను గాలిని పంపించి, సులభంగా ఉపిరి తీసుకునే వీలును కల్పిస్తుంది. అందువల్ల బ్లాక్ టీని తాగితే చాలా మంచిది.
నోటి దుర్వాసనకు చెక్
నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది బ్లాక్ టీ నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఉండే కేట్చిన్ నోటి క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే టానిన్, పాలిఫేనోల్స్ దంతాలను పరిరక్షిస్తాయి. బ్లాక్ టీ తాగితే నోటి దుర్వాసన కూడా రాదు. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది బ్లాక్ టీని నిత్యం తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే కార్టిసాల్ హార్మోన్ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ ఉంటుంది. ఎముకలు గట్టిపడడానికి ఇది దోహదం చేస్తుంది. బ్లాక్ టీ తాగేవారిలో ఆరోగ్యకరమైన ఎముకలుంటాయి.