రింగు..రింగులుగా పొగ వదులుతూ సిగరెట్లు, చుట్టాలు కాల్చే వారికి ఓ హెచ్చరిక. ధూమపానంతో ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇప్పటివరకు తెలుసు. అయితే, పొగతాగే వారి శరీరంలో అన్ని అవయవాలూ తీవ్రంగా దెబ్బ తింటున్నట్లు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్ ఉమాకుమార్ తెలిపారు. ధూమపానంతో ఎముకలు, దంతాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు పేర్కొన్నారు. పొగతాగేవారితో పాటు పీల్చేవారికి కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. మహిళల్లో కూడా ధూమపాన సేవనం పెరుగుతున్నదన్న ఆయన.. సంతానలేమి, ముందస్తు జననాలకు ఇది దారితీయొచ్చన్న హెచ్చరికలు చేసారు. పొగ తాగడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయని చాలామందికి తెలిసినా ఈ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నారు.