‘వయస్సు పెరిగే కొద్దీ మనలో ఆరోగ్యపరమైన సమస్యలు సర్వ సాధారణం. అయితే ఆడవారిలోనే ఆ సమస్యలు ఎక్కువనుకుంటాం. పురుషుల్లోనూ కొన్ని ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి..’
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల తెల్లరక్త కణాల్లో వై-క్రోమోజోమ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు జపాన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఎంఎల్వోవైగా పిలిచే ఈ ‘వై’ క్రోమోజోమ్లు తగ్గితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. అల్జీమర్లు, క్యాన్సర్, గుండెలో సమస్యలు రావచ్చని వివరించారు. ఇతరులతో పోలిస్తే పొగతాగే వారిలో క్రోమోజోమ్ల క్షీణత మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.