‘మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఓ కప్పు టీ పడనిదే రోజు మొదలుకాదు. అయితే టీ అలవాటు ఆరోగ్యానికి చేటని చాలా మంది భావిస్తారు. మితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు….
చటుక్కున ఓ కప్పు చాయ్ తాగేస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు టీ కూడా చేర్చితే.. టీ తాగని వారికన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని చాలా పరిశోధనల ద్వారా తెలిసింది. కానీ తాజాగా మనం రెగ్యులర్గా తీసుకునే టీ వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని అమెరికాలోని నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 14 ఏండ్ల పాటు బ్రిటన్లోని 5 లక్షల మందిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకు రెండు కన్నా ఎక్కువ కప్పుల టీ తాగిన వారిలో 9 శాతం నుంచి 13 శాతం వరకు మరణాలు తగ్గాయని వివరించారు. అయితే హృద్రోగ సంబంధ మరణాలను మాత్రమే ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. క్యాన్సర్కు సంబంధించి ఎలాంటి సంబంధం ఉన్నట్టు ఇందులో పేర్కొనలేదు.