మెదడు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదని, క్యాన్సర్ కణాలు మెదడులోని ఆరోగ్యకరమైన కణాల సాయం తీసుకుని చికిత్స అనంతరం మళ్లీ వ్యాపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ చికిత్సలో హై గ్రేడ్ గ్లయోమా (మెదడు క్యాన్సర్ కణాలు) తమ చుట్టుపక్కల ఉన్న కణాలతో సంబంధం ఏర్పరుచుకుని వ్యాధి నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా బ్రెయిన్ క్యాన్సర్ అనేది చాలా అరుదుగా వస్తుందని, ఒకవేళ సోకితే మాత్రం 90 శాతానికి పైగా రోగులు ఐదేండ్లలోపే మరణిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.