”బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ తో చేతులు కలిపి తమ అపోలో ఫౌండేషన్ నుంచి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉపాసన. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాక, ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఉపాసన. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, తన ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యపరమైన విషయాలపై అవగాహన కలిపిస్తూ., వేలాదిమందికి తన సేవలు అందిస్తున్నారు.
ఢిల్లీ, తమిళనాడు, కర్ణాకట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 150 వృద్ధాశ్రమాలలో ఉన్న వయో వృద్ధులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించారు. క్రమం తప్పకుండ ప్రతి నెలా వీటిని అందించాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు.