భూమిని పోలిన వాతావరణ పరిస్థితులుఅరుణ గ్రహం అంగారుకుడిపై ఉన్నాయా? అవి మానవ నివాసానికి అనుకూలమైనవేనా? అనే అంశంపై కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయ్కొ. ఈ నేపథ్యంలో అంగారకుడిపై నీటి జాడ కోసం సాగుతున్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. ఆ గ్రహంపై మంచు రూపంలో ఉన్న నీరు ఆవిరైందని, ఉపరితలం కింద ఉండొచ్చని చాలా ఏళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు సరికొత్త ఆధారం లభించింది. ఒకప్పుడు అక్కడ ప్రవహించిన నది మామూలు నది కాదని, అత్యంత భీకరంగా ప్రవహించిందని నాసా ప్రయోగించిన ‘పర్సెవెరన్స్’ రోవర్ తాజాగా గుర్తించింది.
ఆ నది ప్రవహించి అంతరించినపోయిన చోట మిగిలిన రాళ్లు, మట్టి ఫోటోలను తీసి పంపింది. ఆ మట్టిలో జీవకోటి మనుగడకు సంబంధించిన ఆవనాళ్లు లభిస్తాయని ఆశిస్తున్నారు. తాజాగా పర్సెవెరన్స్ పంపిన ఆధారాలతో అంగారకుడిపై నదీ ప్రవాహాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ గ్రహంలోని నదులు మనం ఊహించినదానికంటే మరింత లోతు, వేగంగా ప్రవహించినట్టు తేలింది. ‘జెజీరో బిలం’గా వ్యవహరించే ప్రాంతంలోని నది ఆనవాళ్లు కనిపించాయి.