ప్రమాదవశాత్తూ సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 గంటలపాటు ఆ ఆటవస్తువును ఊతంగా చేసుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. ఫాక్స్ 5 న్యూయార్క్ కథనం ప్రకారం.. ఇవాన్ (30) అనే వ్యక్తి తన మిత్రుడితో కలిసి మైతీ బీచ్‌కు వెళ్లాడు. అయితే తీవ్ర అలల కారణంగా వారిద్దరు సముద్రంలో కొట్టుకుపోయారు. చిన్న పిల్లల ఆటవస్తువును ఆసరాగా చేసుకొని ఈ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
‘ప్రాణాలతో బయపడతానని అనుకోలేదు’.. అయితే తాను ప్రాణాలతో బయటపడతానని ఊహించలేదని ఇవాన్ పేర్కొన్నాడు. ఆ బంతిలో గాలి నెమ్మదిగా పోతున్నాకొద్దీ, మళ్లీ గాలి ఊది.. దాని సాయంతోనే మునిగిపోకుండా ఉండగలిగానని తెలిపాడు. ఆ ఫుట్‌బాల్ గనక లభించకపోతే తాను మృతిచెందేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇవాన్ మిత్రుడు మార్టిన్ జవనోస్కి ఆచూకీ మాత్రం లభించలేదు. బహుశా ఆయన సముద్ర జలాల్లో కొట్టుకుపోయి ఉంటాడని భావిస్తున్నారు.