ఆస్ట్రేలియాకు చెందిన పేరొందిన ”డియాకిన్ విశ్వవిద్యాలయం” తన మొదటి విదేశీ క్యాంపస్‌ను గుజరాత్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో ప్రారంభించింది. భారత్‌లో ఒక విదేశీ వర్సిటీ తన బ్రాంచ్ ప్రారంభించడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ ఈ శాఖను ప్రారంభించారు. ‘‘భారత్‌లో- భారత్‌తో – భారత్ కోసం’’ అనే తాత్వికతతో ఈ శాఖను ప్రారంభించినట్టు వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇది ఒక విజయం. బలమైన విద్యా, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలకు ఇది ఆరంభం’ అని అల్బనీస్ ప్రారంభోత్సవ సందర్బంగా ఆనందం వ్యక్తం చేసారు.