‘టర్కీ లో ఉత్తర ప్రాంతమంతా ఎందుకు ఇలా ఎడారిలో ఉంది. దీనికి పరిస్కారం ఉండదా? అని హిక్మత్ ఖయ అనే అటవీ శాఖ ఉద్యోగి మొక్కలు నాటడం.. వాటిని పరిరక్షించడం పనిగా పెట్టుకున్నాడు. అప్పట్లో అతనిని అక్కడివారంతా పిచోడిని చూసినట్లు చూసారు. అయితేనేం.. తన పని ఆపలేదు. పైగా క్రమంగా పరిసర ప్రజలను తనతో చేతులు కలిపేలా చేసుకున్నాడు. రెండేళ్లు, మూడేళ్లు కాదు.. ఏకంగా 35 ఏళ్ల పాటు ఆ ప్రాంతమంతా వేలు, లక్ష్లలు కాదు.. కోట్ల మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు.. ఇపుడు ఆ ఫలితాలు వస్తున్నాయ్.
ఉత్తర టర్కీకి చెందిన హిక్మత్ ఖయ టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పెద్ద అడవిగా మారిపోయింది.
ఆయన అక్కడ పనిచేస్తున్న సమయంలో ఏకంగా 3 కోట్ల మొక్కలను నాటించారు. సిబ్బంది, గ్రామాల ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. 42 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పర్యావరణ ఉద్యమాన్ని టర్కీలో ఇతర ప్రాంతాలలో ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని మొక్కల నాటడానికి ముందుకు వస్తున్నారు. (హిక్మత్ ఖయ.. మొక్కలు నాటడానికి ముందు ఆ ప్రాంతమంతా ఎలా ఉండేదో.. ఆయన చూపిస్తున్న ఫొటోలో చూడొచ్చు.)